Thursday, January 8, 2009

అలా కవినై

దూరమైన రాత్రి నిండా వెన్నెల గదులు
మరణం మీద ప్రయాణిస్తున్న కాలం సూచికని నేను
హద్దులు గీచి సరిహద్దులు చూపగల వాంఛ నాది
ఏ తాత్విక క్షణమో అయోమయంగా
స్పర్సను అఘ్రూనించే అమాయక ప్రపంచానికి
సౌందర్య కాంక్ష గా మారి పోతాను
నిలువెత్తు బింబాన్నై రాగాలు పలుకుతాను.
నాకు నేనే ఏకాంతంగా మూర్చనలు రాలుస్తాను.
పగటి మద్య చీకటినే అలంకరిస్తాను.
ఇప్పుడిక కవిత్త్వానికి ఆంధకారాన్ని అలవాటు చెయ్యాలి
నిర్నిద్రని నిద్ర లేపాలి

No comments:

Post a Comment