Sunday, May 3, 2009

నిన్నే.... ఇప్పటికీ... అలానే...

నిన్నే.... ఇప్పటికీ... అలానే...
ఎందుకలా అకారణంగా .. ఆ అర్థరాత్రి నన్ను..., నా స్నేహాన్ని,.. నా నిలువెత్తు ప్రేమని వదిలేసి వెళ్లావు. ఇప్పటికీ అర్థం కాక అలానే... బాధతో.. చస్తూ బతుకుతున్నాను. పగలు, రాత్రి ఒకటేంటి.. నీవు లేని క్షణం నాకు లేదు. అర్థం కాని జీవితంలో నీవు ఒక అర్థం కాని సమస్యలా మిగిలి పోతున్నావు. రూం చుట్టూ వెన్నెల విరగ బూస్తా వుంది. ఆ వెన్నెల్లో మనిద్దరం కలిసి తిరిగిన రోజులు.. వెన్నెల ఎంత అందంగా వుంది అని నీవు అడిగితే...
నీ నవ్వు నుంచే కదా ఈ వెన్నెలంతా కాసింది అని నేను చెప్తే సరదాగా నువ్వు నన్ను కొట్టిన దెబ్బలు గుర్తొచ్చి నా వీపును తవుడుకున్నాను. కన్నీరంత బాధ అలానే మిగిలింది. చెప్పాను కదా మొన్న కొత్తగా పరిచయం అయిన అ,,, అడిగింది. . “నీవేంటి ఎప్పుడూ నిరుత్సాహంగా ఉంటావు” అంది... ఏం చెప్పను. “కాదు నేను సంతోషంగా ఉన్నాను. ఆ దృష్టి నీలో వుంచుకుని నన్ను చూస్తున్నావు” అన్నాను. “కాదు” అంది. నాకూ తెలుసు నేను చెప్తున్నది అబద్దమని. ఏం.. చెయ్యను నిజం చెప్పలేక పోయాను. అంటే నీవు లేక పోయిన రోజు నుంచి నీ అనుభవాలను... జ్ఞాపకాలుగా మార్చుకొని వాటి నుంచి బయటకు రాలేక ఉన్నాను. నాలో సంతోషం లేదు... సుఖం లేదు. అంతా కోల్పాయానన్న బాధ. భరించలేనంత ఒంటరితనం. ఏకాంతం. నా ఏకాతంలో రెండో మనిషి ఎవరో తెలుసా.. నీవే... దూరంగా ఉన్న నీవే.. దగ్గరగా ఉన్నట్లుండే భావన. నిన్న సాయంత్రం ఆఫీసు చర్చల్లో అడిగారు..“ఆనందం అంటే ఏమిటి.. ఎప్పుడున్నా అనుభవించావా” అని. ఒక్కటే ఛెప్పాను. “ఇప్పటి వరకూ నాకు తెలియదు. అణ్వేషణలో ఉన్నాను”, అని... కాని నిజం ఏంటో నీకు మాత్రమే తెలుసు. నీవు లేని ఆనందం నాకు ఎలా దక్కుతుంది. అసలు ఆనందానికి నిర్వచణాలన్నీ మన పరిచయం నుంచి.. మన కలయిక నుంచి పుట్టాలని ఎన్ని కలల కన్నాం. అవన్నీ భ్రమలు అయ్యాయని గుర్తొచ్చి. చేస్తున్న పని ఆపి కొంత సేపు మౌనంగా ఉండిపొయను, ఈ మధ్య అలా వుండడం అలవాటవుతుందోమోనని బాధగా వుంది. అప్పుడ ఉద్యోగం పోతుంది.
తిండి.. ఈ స్నానం చేయడం ... బట్టలు ఉతుక్కోవడం... పొద్దున్నే చేసే పనులు.. అన్నీ ఆపేసి నీ జ్ఞపకాల్లోనే బతుకుదాం అనుకుంటాను. రోజూ ఉదయాన్నే .. ఏం చెయ్యను 10 అవగానే ఆఫీసుకెళ్ళాలను గుర్తుకొస్తుంది. వెళ్ళకపోతే జీతం. బతకాలిగదా.. అయినా మొన్న మందు తాగుదామని ప్రయత్నం చేశాను. “సారీ నన్ను క్షమించు.. నీవు దూరమైనా నీ కిచ్చిన మాట మీరడానికి ప్రయత్నం చేసినందుకు”. కానీ మందు మత్తు ఇవ్వదని.. నీ జ్ఞాపకమంత మత్తు ఏ మత్తు పదార్థానికీ లేదని నాకు తర్వాత వెంటనే తెలిసింది. క్షణాలు బండరాళ్ళలా దొర్లుతుంటాయి... కాలం కసిగా రాక్షసిలా మారి నన్నే తినాలని చూస్తోంది. ఎన్నిప్రయత్నాలు... అన్నీ విఫలం.. ఎవరన్నా వచ్చి ఓదార్పు ఇస్తే భావుంటుంది అనిపిస్తుంది. అయినా ఈ మౌనాగ్నిని ఎవరు భరించగలరు. సగం నేనే ఆడవాళ్ళకు దూరంగా ఉంటున్నాను. అయనా ఎవరన్నా పరిచయం అయినా నీ అంత చనువు... నీ క్లోజు. అబ్బా ఏం చెప్పను... ఒంటరితనం అని ఫోన్ చేసినప్పుడు నీ వొచ్చి “పిచ్చోడా... నేను ఉండా నీవు ఎలా ఒంటరి వాడవు అవుతావు..” అని. నా తలని ఒటిలో పెట్టుకొని గెట్టిగా అదుముకున్నప్పడు నే పొందిన ఉపశమనాన్ని.. అప్పుడు నాలో కలిగిన భావోద్వేగాన్ని ఎలా మర్చి పొమ్మంటావు. నీ వంటే హృదయం లేని ప్రియురాలివి... సారీ రా అలా అన్నందుకు. ఏదో దూరమయ్యావన్న బాధతో అన్నా.. అంతే. ఎన్ని గుర్తులు.. నీ పాద మంజీరాల్లో తారేడే నా ముద్దుల సవ్వడలు.. అంతా ఒక భ్రమలా ఉంది. అంతా ఒక జల సమాధిలా ఉంది.. ఆ సమాధిలో నిత్యం నేను నీ తపస్సు చేసూ.... ... ప్రియా... ప్రియా... నా...