Wednesday, December 31, 2008

కాలం మన మధ్య ..

మౌనం మధ్య నిలువుగా చీలిన దేహం
ఆకాశం వినని భాషతో నలిగిన కాగితం పూల వాన
ఈ రాజ్యం వదిలిన నిద్రా క్షణాలు
అన్నీ ఒక చర్విత చర్వనంగా
కూలుతున్న స్వప్నాంకురా లిపులు
నేను ఒక భావుక వీచికనై
నిర్నిద్ర ధాత్రి పై నడుస్తూ
చీకటి దాహాల మధ్య
గదులు వేరైనా ఒకటే కాని, కాలేని వివ్రుతాలు
దిన చర్యా జోహార్లు... బతకడాన్ని, బతికించడాన్ని
అక్షరం చేయలేని సంధ్యా సమయాన
పదా అంతా చీకటినే మొహిందాం..!!
తప్పుల రేఖపై విలువునా ...
నువ్వు నేను.. అలా ఇలా.. ఎవరమో !!!

Wednesday, December 24, 2008

నా బ్లాగ్ గురించి

నేను కొత్తగా ఈ విషయాలు నేర్ర్చు కుంటున్నాను. నిదానంగా అన్ని విషయాలు నా బ్లాగ్లో ఉంచగలను.
అయితే .. కొన్ని అంతరంగిక ఆలోచనలు, మనిషిని మనిషి చేసే భావాలూ నిలువునా ఒంటరితనం దహించి వేసే మనసు చర్యలు ఇలా ఎన్నో బ్లాగర్లు చూడగలరని మనవి. ఎవరైనా నాకు బ్లాగ్ నిర్వహణలో కొన్ని సలహాలు ఇవ్వగలరని ఆశిస్తూ ...
కవిత్వం అన్నా, కథలన్నా నాకు ఎక్కువ c. చదువుతాను..., రాలిపోయే ఆకులు, శిశిరం చివర, అలలు పాడే పాట, నేను నాతొ మాత్రమే ఉండే నిముషాలు ఇలా ఎన్నో నాకు ఇష్టం.

Friday, December 19, 2008

ఈ బ్లాగు గురించి...

అందరికి నమస్కారములు.
అల్లూరి వెన్నల అనే బ్లాగు నా కధలు, వ్యాసాలకు సంబందించింది
మీ అభిప్రాయాలు చెప్పగలరు