Sunday, May 3, 2009

నిన్నే.... ఇప్పటికీ... అలానే...

నిన్నే.... ఇప్పటికీ... అలానే...
ఎందుకలా అకారణంగా .. ఆ అర్థరాత్రి నన్ను..., నా స్నేహాన్ని,.. నా నిలువెత్తు ప్రేమని వదిలేసి వెళ్లావు. ఇప్పటికీ అర్థం కాక అలానే... బాధతో.. చస్తూ బతుకుతున్నాను. పగలు, రాత్రి ఒకటేంటి.. నీవు లేని క్షణం నాకు లేదు. అర్థం కాని జీవితంలో నీవు ఒక అర్థం కాని సమస్యలా మిగిలి పోతున్నావు. రూం చుట్టూ వెన్నెల విరగ బూస్తా వుంది. ఆ వెన్నెల్లో మనిద్దరం కలిసి తిరిగిన రోజులు.. వెన్నెల ఎంత అందంగా వుంది అని నీవు అడిగితే...
నీ నవ్వు నుంచే కదా ఈ వెన్నెలంతా కాసింది అని నేను చెప్తే సరదాగా నువ్వు నన్ను కొట్టిన దెబ్బలు గుర్తొచ్చి నా వీపును తవుడుకున్నాను. కన్నీరంత బాధ అలానే మిగిలింది. చెప్పాను కదా మొన్న కొత్తగా పరిచయం అయిన అ,,, అడిగింది. . “నీవేంటి ఎప్పుడూ నిరుత్సాహంగా ఉంటావు” అంది... ఏం చెప్పను. “కాదు నేను సంతోషంగా ఉన్నాను. ఆ దృష్టి నీలో వుంచుకుని నన్ను చూస్తున్నావు” అన్నాను. “కాదు” అంది. నాకూ తెలుసు నేను చెప్తున్నది అబద్దమని. ఏం.. చెయ్యను నిజం చెప్పలేక పోయాను. అంటే నీవు లేక పోయిన రోజు నుంచి నీ అనుభవాలను... జ్ఞాపకాలుగా మార్చుకొని వాటి నుంచి బయటకు రాలేక ఉన్నాను. నాలో సంతోషం లేదు... సుఖం లేదు. అంతా కోల్పాయానన్న బాధ. భరించలేనంత ఒంటరితనం. ఏకాంతం. నా ఏకాతంలో రెండో మనిషి ఎవరో తెలుసా.. నీవే... దూరంగా ఉన్న నీవే.. దగ్గరగా ఉన్నట్లుండే భావన. నిన్న సాయంత్రం ఆఫీసు చర్చల్లో అడిగారు..“ఆనందం అంటే ఏమిటి.. ఎప్పుడున్నా అనుభవించావా” అని. ఒక్కటే ఛెప్పాను. “ఇప్పటి వరకూ నాకు తెలియదు. అణ్వేషణలో ఉన్నాను”, అని... కాని నిజం ఏంటో నీకు మాత్రమే తెలుసు. నీవు లేని ఆనందం నాకు ఎలా దక్కుతుంది. అసలు ఆనందానికి నిర్వచణాలన్నీ మన పరిచయం నుంచి.. మన కలయిక నుంచి పుట్టాలని ఎన్ని కలల కన్నాం. అవన్నీ భ్రమలు అయ్యాయని గుర్తొచ్చి. చేస్తున్న పని ఆపి కొంత సేపు మౌనంగా ఉండిపొయను, ఈ మధ్య అలా వుండడం అలవాటవుతుందోమోనని బాధగా వుంది. అప్పుడ ఉద్యోగం పోతుంది.
తిండి.. ఈ స్నానం చేయడం ... బట్టలు ఉతుక్కోవడం... పొద్దున్నే చేసే పనులు.. అన్నీ ఆపేసి నీ జ్ఞపకాల్లోనే బతుకుదాం అనుకుంటాను. రోజూ ఉదయాన్నే .. ఏం చెయ్యను 10 అవగానే ఆఫీసుకెళ్ళాలను గుర్తుకొస్తుంది. వెళ్ళకపోతే జీతం. బతకాలిగదా.. అయినా మొన్న మందు తాగుదామని ప్రయత్నం చేశాను. “సారీ నన్ను క్షమించు.. నీవు దూరమైనా నీ కిచ్చిన మాట మీరడానికి ప్రయత్నం చేసినందుకు”. కానీ మందు మత్తు ఇవ్వదని.. నీ జ్ఞాపకమంత మత్తు ఏ మత్తు పదార్థానికీ లేదని నాకు తర్వాత వెంటనే తెలిసింది. క్షణాలు బండరాళ్ళలా దొర్లుతుంటాయి... కాలం కసిగా రాక్షసిలా మారి నన్నే తినాలని చూస్తోంది. ఎన్నిప్రయత్నాలు... అన్నీ విఫలం.. ఎవరన్నా వచ్చి ఓదార్పు ఇస్తే భావుంటుంది అనిపిస్తుంది. అయినా ఈ మౌనాగ్నిని ఎవరు భరించగలరు. సగం నేనే ఆడవాళ్ళకు దూరంగా ఉంటున్నాను. అయనా ఎవరన్నా పరిచయం అయినా నీ అంత చనువు... నీ క్లోజు. అబ్బా ఏం చెప్పను... ఒంటరితనం అని ఫోన్ చేసినప్పుడు నీ వొచ్చి “పిచ్చోడా... నేను ఉండా నీవు ఎలా ఒంటరి వాడవు అవుతావు..” అని. నా తలని ఒటిలో పెట్టుకొని గెట్టిగా అదుముకున్నప్పడు నే పొందిన ఉపశమనాన్ని.. అప్పుడు నాలో కలిగిన భావోద్వేగాన్ని ఎలా మర్చి పొమ్మంటావు. నీ వంటే హృదయం లేని ప్రియురాలివి... సారీ రా అలా అన్నందుకు. ఏదో దూరమయ్యావన్న బాధతో అన్నా.. అంతే. ఎన్ని గుర్తులు.. నీ పాద మంజీరాల్లో తారేడే నా ముద్దుల సవ్వడలు.. అంతా ఒక భ్రమలా ఉంది. అంతా ఒక జల సమాధిలా ఉంది.. ఆ సమాధిలో నిత్యం నేను నీ తపస్సు చేసూ.... ... ప్రియా... ప్రియా... నా...

Friday, April 3, 2009

కొన్ని లేఖల వెనుక

జ్ఞాపకానికి సరి హద్దులు గీస్తూనే ఉన్నా... అయినా ఎక్కడో పారేసుకున్న నన్ను నేను ఎలా వెదుక్కో గలను. అన్ని ఒక్కో సారి తెలుస్తూనే జరుగుతాయి. మనల్ని మనం దగ్గర నుండి చూసుకొంటూ ఉంటాం. సాక్షం కూడా మనమే. పక్కనే నిలబడి ప్లీజ్ అలా చేయకండి అని అరుస్తూ ఉంటాం . కాని ఎవరూ వినరు\? జైలు మద్య ఊసలు లేక్కబెడ్తూ జీవిత శిక్ష మనకు అమలు పరుస్తూనే ఉంటారు. అలా ఎన్నో సార్లు జరిగినా దూరాన్ని ఏ రాత్రో దగ్గరగా భావించి జ్ఞాపకాల్లో సముద్రాన్ని మదిస్తూనే ఉన్నా... అలా నేను నేను అవుతూ , కాకుండా బోయే క్షణాలను లేఖలుగా, నా యెద చితిని ఆవిష్కరిస్తూ కొన్ని రాతలు .... ఇక నుండి నా... బ్లాగ్ లో

Thursday, February 5, 2009

తలపు తీస్తే

ఘడియ పడిన తలపు నిండా రోదిస్తున్న స్వప్న శిఖలె.. అనంతం కాని ఆత్మలో ఐక్యం మైన దేహాల ఖచిత భాషా లిపులు. కాలి గుర్తుల శబ్దాల్లో బింబ ప్రతిబింబ వైవిద్యాలు. 'మనం' చుట్టూ నలుగుతున్న ఏకాంతానికి జరిగిన బారసాల . ఎవరో పాడుతూనే ఉన్న మిశ్రగానం. నడుస్తూనే చస్తున్న మునేళ్ళ రాపిడి. ఓటమి అంత పెత్తనం ప్రపంచానికి ఇవ్వాలని ...!! ఆశ..!! నాకు నేనే లోబడిన స్వర్గరోహ పర్వం. తుదిని తుడిచిన ప్రారభంలో తూగుతున్న మనసు సయ్యాట. దారి నిండా ఎంగిలి జీవితాల్ని ఎవర్రా దొంగలిస్తున్నది.. ? హృదయ కవాటాల్లో నిద్రని, కాసిని నింపుతున్నది!! రామిస్తున్నది...!!?

Thursday, January 8, 2009

అలా కవినై

దూరమైన రాత్రి నిండా వెన్నెల గదులు
మరణం మీద ప్రయాణిస్తున్న కాలం సూచికని నేను
హద్దులు గీచి సరిహద్దులు చూపగల వాంఛ నాది
ఏ తాత్విక క్షణమో అయోమయంగా
స్పర్సను అఘ్రూనించే అమాయక ప్రపంచానికి
సౌందర్య కాంక్ష గా మారి పోతాను
నిలువెత్తు బింబాన్నై రాగాలు పలుకుతాను.
నాకు నేనే ఏకాంతంగా మూర్చనలు రాలుస్తాను.
పగటి మద్య చీకటినే అలంకరిస్తాను.
ఇప్పుడిక కవిత్త్వానికి ఆంధకారాన్ని అలవాటు చెయ్యాలి
నిర్నిద్రని నిద్ర లేపాలి

Wednesday, December 31, 2008

కాలం మన మధ్య ..

మౌనం మధ్య నిలువుగా చీలిన దేహం
ఆకాశం వినని భాషతో నలిగిన కాగితం పూల వాన
ఈ రాజ్యం వదిలిన నిద్రా క్షణాలు
అన్నీ ఒక చర్విత చర్వనంగా
కూలుతున్న స్వప్నాంకురా లిపులు
నేను ఒక భావుక వీచికనై
నిర్నిద్ర ధాత్రి పై నడుస్తూ
చీకటి దాహాల మధ్య
గదులు వేరైనా ఒకటే కాని, కాలేని వివ్రుతాలు
దిన చర్యా జోహార్లు... బతకడాన్ని, బతికించడాన్ని
అక్షరం చేయలేని సంధ్యా సమయాన
పదా అంతా చీకటినే మొహిందాం..!!
తప్పుల రేఖపై విలువునా ...
నువ్వు నేను.. అలా ఇలా.. ఎవరమో !!!

Wednesday, December 24, 2008

నా బ్లాగ్ గురించి

నేను కొత్తగా ఈ విషయాలు నేర్ర్చు కుంటున్నాను. నిదానంగా అన్ని విషయాలు నా బ్లాగ్లో ఉంచగలను.
అయితే .. కొన్ని అంతరంగిక ఆలోచనలు, మనిషిని మనిషి చేసే భావాలూ నిలువునా ఒంటరితనం దహించి వేసే మనసు చర్యలు ఇలా ఎన్నో బ్లాగర్లు చూడగలరని మనవి. ఎవరైనా నాకు బ్లాగ్ నిర్వహణలో కొన్ని సలహాలు ఇవ్వగలరని ఆశిస్తూ ...
కవిత్వం అన్నా, కథలన్నా నాకు ఎక్కువ c. చదువుతాను..., రాలిపోయే ఆకులు, శిశిరం చివర, అలలు పాడే పాట, నేను నాతొ మాత్రమే ఉండే నిముషాలు ఇలా ఎన్నో నాకు ఇష్టం.

Friday, December 19, 2008

ఈ బ్లాగు గురించి...

అందరికి నమస్కారములు.
అల్లూరి వెన్నల అనే బ్లాగు నా కధలు, వ్యాసాలకు సంబందించింది
మీ అభిప్రాయాలు చెప్పగలరు